సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 మే 2022 (12:01 IST)

ఎం.ఎస్.రాజు కొత్త చిత్రం సతి ఫస్ట్ లుక్

Sumant Ashwin, Meher Chahal
Sumant Ashwin, Meher Chahal
తన నిర్మాణంలో తెలుగు పరిశ్రమకి ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు  దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. గతేడాది తన దర్శకత్వంలో వచ్చిన డర్టీ హరి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎం.ఎస్.రాజు, మరింత వైవిధ్యమైన, వినూత్నమైన కథలతో వస్తూ తన దర్శకత్వ పటిమని నిరూపించుకుంటున్నారు.
 
ఇటీవల అయన దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ విడుదలకి సిద్ధంగా ఉండగానే, 'సతి' అనే పేరుతో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్బంగా నేడు విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు.
 
కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథలో ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రూపొందుతున్న 'సతి', తన దర్శకత్వ కేరీర్ లోనే గర్వంగా చెప్పుకోతగ్గ చిత్రమవు తుందంటున్నారు, ఎం.ఎస్.రాజు.
 
సీనియర్ నటులు డా.నరేష్ గారు ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుండగా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, సుమంత్ అశ్విన్, రఘురామ్ .టి, సారంగ సురేష్ కుమార్ & డా. రవి దాట్ల ఈ చిత్రాన్ని వైల్డ్ హనీ ప్రొడక్షన్ & రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు.
 
సినిమాటోగ్రఫీ: రాకేష్ హాసమని, వెంకట్
ఎడిటర్: జునైద్ సిద్దికి
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ మూడవత్
స్టిల్స్: వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అండే
సహాయ దర్శకుడు: విజయ్ సామ్రాట్ చిలక
అసిస్టెంట్ డైరెక్టర్: అనిరుధ్ వల్లభనేని
పిఆర్ఓ: పులగం చిన్నారాయణ
డిజిటల్ పిఆర్: సుధీర్ తేలప్రోలు
సహ-నిర్మాత: జె.శ్రీనివాస రాజు
నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రఘురామ్ .టి, సారంగ సురేష్ కుమార్, డా. రవి దాట్ల
నిర్మాణ సంస్థ: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ & రమంత్ర క్రియేషన్స్
సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
కథ & దర్శకత్వం: ఎం.ఎస్.రాజు