బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (18:58 IST)

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కిరణ్ అబ్బవరం సమ్మతమే

Kiran Abbavaram, Chandini Chowdhary
Kiran Abbavaram, Chandini Chowdhary
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న "సమ్మతమే" చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది.
 
ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ ఇత్ప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతోంది.
 
ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. 'సమ్మతమే' చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్ గా వుంది. హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది. హ్యాపీ స్మైల్స్ తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
 
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.