బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (07:30 IST)

రియాల్టీ షో పేరుతో ఏదైనా చూపిస్తారా? హైకోర్టు ప్రశ్న

big boss
బిగ్ బాస్ రియాల్టీ షోకు బ్రేకులు పడేలా కనిపిస్తుంది. ఈ షో పేరుతో ఏదైనా చూపిస్తారా? అంటూ ఏపీ హైకోర్టు నిర్వాహకులను ప్రశ్నించింది. బిగ్ బాస్ రియాల్టీ షో పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కుదరదని, తాము కళ్లుమూసుకుని కూర్చోలేమని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
గత కొన్ని సీజన్లుగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో అసభ్యతతో పాటు అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత 2019లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఇప్పటికి విచారణకు వచ్చింది. 
 
న్యాయమూర్తులు అసనుద్దీన్ అమానుల్లా, ఎస్.సుబ్బారెడ్డిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను ధర్మాసనం అభినందించింది. మంచి కారణంతోనే పిటిషన్ దాఖలు చేశారంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది.