మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (17:38 IST)

గణేష్ బెల్లంకొండ హీరోగా స్వాతిముత్యం

Ganesh Bellamkonda, Varsha Bollamma
Ganesh Bellamkonda, Varsha Bollamma
గణేష్ బెల్లంకొండ  హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం' ను దర్శకుడు తీర్చి దిద్దారు దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు. 
 
దర్శకుడు మాటల్లో చెప్పాలంటే 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. 
ఇటీవల విడుదల అయిన 'స్వాతిముత్యం' ప్రచార వీడియో చిత్రంవినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందిందని, అందులోని  దృశ్యాలు చూసిన అందరికీ  అనిపించింది. వీడియో చిత్రం లోని సంభాషణలు  సైతం ఈ విషయాన్ని బలపరిచాయి. 
 
గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. 
 
'స్వాతిముత్యం' చిత్రానికి 
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ