1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 మే 2022 (13:48 IST)

సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన

ooru peru Bhairavkona look
ooru peru Bhairavkona look
సందీప్ కిషన్ హీరోగా వైవిధ్యమైన కధాంశాలతో సినిమాలని రూపొందించే విఐ ఆనంద్ దర్శకత్వంలో డిఫరెంట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో, సందీప్ కిషన్ 28వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ,.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ''ఊరు పేరు భైరవకోన' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. సందీప్ కిషన్ తన చేతిలో మంత్రదండంతో కనిపిస్తుండగా అతనికి సమీపంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ మిగతా కట్టడాలు చిన్నవిగా కనిపించడం పెర్ఫెక్ట్ ఫాంటసీ వరల్డ్ ని కళ్ళముందు వుంచింది. ఈ పోస్టర్ తో దర్శకుడు విఐ ఆనంద్ తన మార్క్ ని చూపించి ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచారు.
 
మేకింగ్ వీడియో విజువల్స్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి. సందీప్ కిషన్ లుక్స్ ఆకట్టుకున్నాయి. వంటినిండా మంటలతో ఓ వ్యక్తి నీళ్ళలోకి దూకుతున్న సీక్వెన్స్ టెర్రిఫిక్ గా వుంది. మేకింగ్ వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం కూడా ఉత్కంఠని రేకెత్తించింది.
 
కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌గా, ఎ రామాంజనేయులు ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు, నందు సవిరిగాన  డైలాగ్స్ అందిస్తున్నారు.
తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు
సాంకేతిక  విభాగం :
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగాన