గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (11:51 IST)

మార్చురీకి వెళ్లొచ్చాక జీవితం అంటే ఏంటో అర్థమైంది.. అమలాపాల్

amala paul
స్టార్ హీరోయిన్ అమలాపాల్ నటించిన తాజా సినిమా కడవర్. డైరెక్టర్ అనూప్ పనికర్ రూపొందించిన ఇన్వెస్టిగేటర్ థ్రిల్లర్ కడవర్ ఆగస్ట్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో స్ట్రీమింగ్ అవుతుంది.
 
ఇందులో డాక్టర్ భద్ర పోలీస్ సర్జన్ పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం చిత్రయూనిట్ పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేశామని.. తాను మర్చురీలోకి వెళ్లి పోస్ట్ మార్టం చేయడం చూసినట్లు చెప్పుకొచ్చింది అమలాపాల్.  
 
అమలాపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మార్చురీకి వెళ్లామని.. అక్కడ నేరుగా పోస్ట్ మార్టం చేయడం చూశాను. నిజంగా చెప్పాలంటే నా జీవితాన్ని మార్చే అనుభవం ఇది. హృదయాన్ని కదిలించింది.. అప్పటి నుంచి నా జీవితం మారిందని.. చెప్పుకొచ్చింది. 
 
ప్రాణంలేని శరీరాన్ని చూసినప్పుడు నిజంగానే మేలుకోవతో ఉందా అనే సందేహం కలిగింది. అహంకారమనేది మరణంతో సమానం. మార్చురీలో ప్రాణం లేని శరీరాన్ని చూసిన తర్వాత జీవితంలో అనేక విషయాలను భిన్నంగా చూడాలనుకున్నానని తెలిపింది.