గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:29 IST)

రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

chandrababu
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ వుండాల్సి వస్తోందని పరోక్షంగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసారు.

 
ప్రజలను రక్షించే పోలీసులను రౌడీలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేస్తుంటే ఏమీచేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెధవ పని చేసి బహిరంగంగా ఎవరైనా తిరగలేరనీ, సిగ్గులేని వారే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు.


ఎవరు తప్పు చేస్తే వారిని సీఎం మందిలించి దండన విధిస్తే పరిస్థితి ఇక్కడ దాకా రాదనీ, మిగిలినవారికి భయం కలుగుతుందని అన్నారు. సీఎం ఉదాశీన వైఖరి కారణంగానే విద్రోహశక్తులు మరింత పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.