సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2022 (22:09 IST)

దరిద్రపు వీడియో, ఇలాంటి దౌర్భాగ్యం ఎపుడైనా చూసామా? గోరంట్ల మాధవ్ వీడియోపై 'థర్టీ ఇయర్స్ పృధ్వీ'

Prudhvi Raj
వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై థర్టీ ఇయర్స్ పృధ్వీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆ దరిద్రపు వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాడిని భాష ఆ పార్టీ నాయకులకు బాగా నచ్చేసినట్లుంది. ఇంత దౌర్భాగ్యం ఇంతకుముందెన్నడూ చూసి వుండం.

 
తెలుగు ఎంపీలంటే పార్లమెంటులో ఎంతో మంచిపేరు వుంది. గోరంట్ల వీడియోతో అది మొత్తం తుడిచుకుపోయింది. పృధ్వీపై వారం రోజుల పాటు విరామం లేకుండా మీడియా సమావేశాలు పెట్టిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఎటు పోయారో. గోరంట్ల మాధవ్ వీడియో అంతా ఫేక్ అని అనంతపురం ఎస్పీ చెపుతున్నారు కానీ ప్రజలకు అది ఫేక్ వీడియోనా కాదో తెలుసు. ఒరిజినల్ వీడియో వుంటేనే కదా ఫేక్ వీడియోనో కాదో తెలిసేది అంటూ ప్రశ్నించారు.