గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (17:20 IST)

పార్కింగ్ ఏరియా.. గుంతలో పడిపోయిన బైక్‌.. వీడియో వైరల్

Bike
Bike
ఓ టూ-వీలర్ ప్రమాదవశాత్తూ పార్కింగ్ ఏరియాలోని గుంతలో పడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన బైక్‌ను పార్కింగ్ ప్రాంతం నుండి రివర్స్ చేస్తూ, ప్రమాదవశాత్తూ వెనుక ఉన్న గుంతలో పడిపోవడం కనిపించింది.
 
అది ప్రమాదకరమైన లోతైన గొయ్యి ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యక్తి తన బైక్‌తో పాటు గుంతలో పడిపోయాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి లక్షల్లో వ్యూస్‌, షేర్లు వస్తున్నాయి. 
 
ఈ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి, వారిలో కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తూ, మరికొంతమంది అతనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి