శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (15:17 IST)

చెప్పుకునేంత ఆసక్తికరంగా నా శృంగారం జీవితం లేదు: తాప్సీ షాకింగ్ కామెంట్

Tapsee
తాప్సీ... బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. ఆమె కాఫీ విత్ కరణ్ షోపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ షోలో ఆయా నటీనటులు తమతమ చిత్రాల ప్రమోషన్ల కోసం ఎగబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా... దీనిపై తాప్సీకి ఓ ప్రశ్న ఎదురైంది.

 
కరణ్ జోహార్ మిమ్మల్ని ఎప్పుడైనా తన షో కోసం సంప్రదించారా అని అడుగ్గా... చెప్పుకునేంత గొప్పగా తన శృంగారం జీవితం లేదంటూ సెటైర్లు వేసారు తాప్సీ. ఈ కామెంట్లు కాఫీ విత్ కరణ్ షో పైనేనని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకంటే కరణ్ జోహార్ ఎక్కువగా సినీ స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తుంటారు.

 
ఇటీవల సమంతను మీ భర్త నాగచైతన్య అనగానే... సమంత... భర్త కాదు మాజీ భర్త అని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కరీనా కపూర్ తో మాట్లాడుతూ... మీ మాజీ భర్తతో షోకి వచ్చారని నాలుక్కరచుకుని... మాజీ బోయ్ ఫ్రెడ్ షాహిద్ కపూర్ అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపధ్యంలో తాప్సీ ఇలా స్పందించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.