గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (13:17 IST)

మీకు మా అయ్య, మా తాత తెలీదు.. ట్రైలర్‌కే ఇంత రచ్చేంద్రా నాయినా..?

Liger
Liger
"లైగర్" సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రతో మెప్పించబోతున్నారు. 
 
ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్స్‌లో ట్రైలర్ విడుదల వేడుకను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..  
 
'మీకు మా అయ్య తెలీదు, మా తాత తెలీదు. ఎవ్వడూ తెలీదు. సినిమా రిలీజ్ అయి రెండేళ్లయ్యింది. ముందు రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకొనే సినిమా కాదు. అయినా ట్రైలర్‌కే ఇంత రచ్చేంద్రా నాయినా.. డాన్సంటే నాకు చిరాకు... అంత డాన్స్ చేశానంటే కారణం.. మా వాళ్లు ఎంజాయ్ చేయాలి.. అని చేశా. ఈ సినిమాని మా ఫ్యాన్స్‌కి అంకితం చేస్తున్నా. 
 
ఆగస్టు 25 థియేటర్లు నిండిపోవాలి. గ్యారెంటీగా చెబుతున్నా. ఆగస్టు 25 ఇండియా షేక్ అయిపోతుంది. ప్రమోషన్లు లేట్ అయ్యాయని మీరంతా ఫీలయ్యారు.. ఇప్పుడు బుల్లెట్ దిగిందా, లేదా?' అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.