ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 జులై 2022 (16:50 IST)

విజయ్ దేవరకొండ లుక్‌కు అమ్మాయిలు ఫిదా

Vijay Devarakonda lady fans
Vijay Devarakonda lady fans
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమా యొక్క బోల్డ్ పోస్టర్ ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పలు విమర్శలు, ప్రశంసల మధ్య ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25 వ తేదీన రాబోతున్న ఈ సినిమా కి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. 
 
ఈ బోల్డ్ పోస్టర్ తో ప్రమోషన్స్ కి తెరలేపిన చిత్ర బృందం ఇకపై జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రోజే పోస్టర్ కి లేడీ అభిమానుల దగ్గరినుంచి మరింత ఆదరణ దక్కింది. సెక్సీయెస్ట్ పోస్టర్ ఎవర్ అని ట్విట్టర్ ట్రెండ్ చేసి అభిమానులు ఈ సినిమా క్రేజ్ ను మరింతగా పెంచారు. సినిమా నేపథ్యానికి తగ్గ పోస్టర్ ను విడుదల చేసి అక్కడే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే అక్కడితోనే అభిమానులు ఆగిపోలేదు. ఈ పోస్టర్ వచ్చి రెండు రోజులు అవుతున్నా ఇంకా పోస్టర్ ను ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది లేడీ అభిమానులు సినిమా పై ఉన్న ఇష్టమో లేదా విజయ్ మీద ఉన్న ఇష్టమో తెలీదు కానీ వారి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దేవరకొండ పేరును జోడించడం విశేషం.
 
దీన్ని బట్టి విజయ్ దేవరకొండ కు అమ్మాయిల్లో ఎలాంటి ఫాలోయిందో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్స్ లలో కూడా విజయ్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ ఈ బోల్డ్ పోస్టర్ ను తమ తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఆయనపై వారికున్న ఇష్టాన్ని చాటుకున్నారు. మరి ఇదే జోష్ కొనసాగితే ఆగస్టు లో రిలీజ్ కాబోయే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి భారీ రికార్డులను ఏర్పరచడం ఖాయం. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను , పాటలను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.