గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (15:28 IST)

Gorantla Madhav Video: ఆ న్యూడ్ వీడియోలో వున్నది తను కాదన్న మహిళ

gorantla madhav
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వీడియోలో వున్నది ఫలానా మహిళ అంటూ ప్రచారమవుతున్న నేపధ్యంలో అందులో వున్నది తను కాదంటూ సదరు మహిళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ట్విట్టర్లో మాలతిరెడ్డి అనే యూజర్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని వేణు, చందు, రమణ, నవీన్ కుమార్ అనే వ్యక్తులు ఫార్వర్డ్ చేసారంటూ ఫిర్యాదులో పేర్కొంది.

 
బెంగళూరులో వైసిపి సోషల్ మీడియాలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో ఆమెకి గాండ్లపెంటకు చెందిన వ్యక్తితో వివాహమైందనీ, తనకు ఈ వీడియోకి ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించినట్లు సమాచారం. దీనితో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

 
మరోవైపు ఆ వీడియోలో వున్నది తను కాదనీ, ఎవరో తను వ్యాయామం చేస్తున్నప్పుడు మార్ఫింగ్ చేసి వీడియో అప్ చేసారంటూ ఎంపీ గోరంట్ల చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ వీడియోలో వున్నది గోరంట్ల అని రుజువైతే కఠిన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంకోవైపు గోరంట్ల వీడియోపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నాయి.