గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (22:25 IST)

భూమిని కబ్జా చేశాడు.. మహిళ పట్ల అలా ప్రవర్తించాడు..

bjp
bjp
బీజేపీలో దురుసుగా ప్రవర్తించే నేతలకు ఢోకా లేదనే చెప్పాలి. తాజాగా బీజేపీకి చెందిన ఒక యువనేత భూమి కబ్జా చేయటమే కాకుండా ఒక మహిళపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 93బీలోని గ్రాండ్ ఓమాక్సేలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి నివాసం ఉంటున్నాడు. అయితే మూడేళ్ల క్రితం సొసైటీకి చెందిన కామన్ ఏరియాతో పాటు పాటు పార్క్‌ను ఆక్రమించుకున్నాడు. 
 
దీంతో 2019 నుంచి సొసైటీ సభ్యులకు, శ్రీకాంత్ త్యాగికి గొడవలు ఉన్నాయి. ఆగస్టు5 శుక్రవారం ఉదయం పార్క్ ఏరియాలో మొక్కలు నాటేందుకు శ్రీకాంత్ వచ్చాడు. అతన్ని సొసైటీకి చెందిన ఓ మహిళ అడ్డుకున్నారు. దీంతో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన త్యాగి చేయితో నెట్టేశాడు.
 
ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. తనతో పాటు తన భర్త, పిల్లలను త్యాగి బెదిరింపులకు గురి చేశాడని, అసభ్యకర పదజాలంతో దూషించాడని తెలిపింది. ఇకపోతే మహిళపై చేయి చేసుకున్న త్యాగిని కఠినంగా శిక్షించాలని….తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కాగా ఈ సంఘటన జరిగిన తర్వాత బీజేపీ ఉన్నత స్థాయి నాయకులు త్యాగి తమ పార్టీ సభ్యుడు కాదని ప్రకటించుకున్నారు. అయితే…త్యాగి తనను తాను బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యునిగా మరియు అధికార పార్టీకి చెందిన యువ కిసాన్ సమితి జాతీయ కో-కార్డినేటర్‌గా సోషల్ మీడియాలో రాసుకున్నారు.