గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (16:21 IST)

ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా?: రాజాసింగ్ కౌంటర్

rajasingh
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతూ వుంటుంది. తాజాగా గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్‌కు కౌంటరేశారు.
 
ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా? అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మా ముగ్గురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు కదా. ఎంపీల సస్పెన్షన్ గురించి ట్వీట్ చేసే అధికారమే నీకు లేదు. ఓటీటీలో ఏమి చూడాలని అడుగుతున్నావు కదా? కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడు. మోదీ, అటల్ బిహారీ వాజపేయి చరిత్ర చదువు. నాస్తికుడి నుంచి ఆస్తికుడవు అవుతావు అన్నారు రాజా సింగ్.
 
అంతకుముందు రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.