మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (12:40 IST)

జనాభా నియంత్రణ బిల్లు పెడతామన్న రవి కిషన్.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్

ravikishan
దేశంలో జనాభా నియంత్రణపై తాను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, లోక్‌సభలో బీజేపీ ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే దీని లక్ష్యం అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, "జనాభా నియంత్రణ బిల్లు తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటనం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను" అంటూ ఆయన వెల్లడించారు. 
 
కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టేవాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశపెట్టేది కూడా ప్రైవేటు బిల్లే. మరోవైపు, ఈ బిల్లు ప్రవేశపెడతానని రవికిషన్ చెప్పగానే.. ఆయనపై నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఆయన నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లల కంటే కుమారుడు చిన్నవాడు కావడంపైనా ప్రశ్నిస్తున్నారు.