1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. We will bring in population control law when we come to power: Bandi Sanjay

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం: బండి సంజయ్‌

population control
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పేరు మార్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

2023లో రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్‌ అన్నారు. మేం అధికారంలోకి రాగానే యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తామని, కేసీఆర్‌కు దమ్ముంటే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

సంజయ్ ఓ డమ్మీ:జగ్గారెడ్డి
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ డమ్మీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. "నీకు దమ్ముంటే ప్రధానితో ప్రతి అకౌంట్‌లో 15లక్షలు వేయించు" అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదా వేసుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక, పీసీసీ కమిటీ సభ్యులందరూ కలిసి రాహుల్‌ను కలవాలని మొదటి రోజే అనుకున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 
About Writer
ఎంజీ
తర్వాతి కథనం
కేసీఆర్ మోసగాడు: షర్మిల