మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:30 IST)

పవన్‌ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణా గవర్నర్‌ తమిళిసై

ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ చాలా డిఫ‌రెంట్ గా ఆలోచిస్తారు... డిఫెరెంట్ గా న‌డుచుకుంటారు. అదే ఆయ‌న్ని అంద‌రికీ అభిమాన హీరోగా మార్చేస్తుంది. ఇపుడు ఆ కోవ‌లోకి ఫ్యాన్స్ నే కాదు... రాజ‌కీయ పెద్ద‌లు కూడా చేరిపోతున్నారు. 
 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ మొచ్చుకున్నారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. 

 
కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ, తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ ట్వీట్‌ చేశారు.