సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (09:51 IST)

8 వేల దళిత కుటుంంబాలకు రూ.800 కోట్లు బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టికేంద్రీకరించారు. ఈ పథకం అమలులో భాగంగా, 8 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.800 కోట్ల నగదు బదిలీ జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 20 వేల దళిత కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం 8 వేల కుటుంబాలకు నగదు బదిలీ చేసింది. నియోజకవర్గంలో గత రెండు వారాలుగా  గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి  పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 
 
వీటిని పరిశీలించిన ఎంపీడీవోలు లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. దీని ఆధారంగా గత మూడు రోజులుగా అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తున్నారు. శుక్రవారం రూ.100 కోట్లు, శనివారం రూ.200 కోట్లు, నిన్న రూ.500 కోట్లు చొప్పున జమచేసినట్టు అధికారులు తెలిపారు.