శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:22 IST)

ఆ బాధ్యత గురువులకే దక్కుతుంది : సబితా ఇద్రారెడ్డి

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని తెలుు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. 
 
రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.