పవన్ 50వ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన స్టార్ క్రికెటర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగానే అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. పవన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. భారత క్రికెట్ స్టార్ మరియు టెస్ట్ ప్లేయర్ అయిన హనుమ విహారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
పవన్ కళ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. అందులో పవన్‌కి తాను అభిమాని అని తెలిపాడు.అలాగే అతను ఆరు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్‌తో దిగిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి దాయకమైన వ్యక్తి పవర్ స్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం హనుమ విహారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు.