సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అన్నయ్యకు తమ్ముడు శుభాకాంక్షలు.. నేనే తొలి అభిమానిని...

ఆగస్టు 22వ తేదీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి త‌న‌కే కాకుండా ఎందరికో మార్గదర్శి అంటూ కొనియాడారు. 
 
ఆయన తమ్ముడిగా తాను పుట్టడం ఒక అదృష్టమ‌ని, అంతేగాక చిరులోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమ‌ని ప‌వ‌న్ అన్నారు. చిరంజీవిని అభిమానించి, ఆరాధించే లక్షలాదిమందిలో తాను తొలి అభిమానినని ఆయ‌న చెప్పారు. 
 
చిరంజీవిని చూస్తూ, ఆయన సినిమాలను వీక్షిస్తూ, ఆయన ఉన్నతిని కనులారా చూశానని తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చిరంజీవిలోని అద్భుత లక్షణమ‌ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 
 
ఎన్ని విజయాలు ఎన్ని సాధించినప్ప‌టికీ, ఎన్ని రికార్డులు సృష్టించినప్ప‌టికీ ఆయ‌న‌లో అదే విధేయత, వినమ్రత ఉంటాయ‌ని చెప్పారు. అందువల్లే చిరంజీవిని ల‌క్ష‌లాది మంది సొంత మనిషిలా భావిస్తారన్నారు. చిరంజీవి త‌మ కుటుంబంలో అన్నగా పుట్టినా త‌మ‌ని తండ్రిలా పెంచార‌ని ఆయ‌న తెలిపారు.