సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (11:55 IST)

#BheemlaNayak లేటెస్ట్ వీడియో రిలీజ్

పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది బీమ్లా నాయక్ యూనిట్. ఈమధ్యే ఫస్ట్ గ్లింప్స్ వీడియో వదలగా.. తాజాగా మరో స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ గన్ పట్టి షూట్ చేస్తూ కనిపించారు. భీమ్లా నాయక్‌ ఇన్‌ బ్రేక్‌ టైమ్‌ అంటూ వదిలిన ఈ వీడియోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. 
 
షూటింగ్ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్‌ ఇలా గన్‌ చేతపట్టారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో బీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ గా రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.