శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (12:08 IST)

విజయవాడలో జనసేనాని.. పిఎస్పీకే రానా నుంచి టైటిల్ వచ్చేస్తోంది

విజయవాడలో శనివారం జనసేనాని పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం విమానంలో పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకోనున్నారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు.
 
మరోవైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దుమ్మురేపేద్దాం అంటూ మెగా పవర్ ఫ్యాన్స్‌ను హూషారెత్తించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ "వకీల్ సాబ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో "పిఎస్పీకే రానా" సినిమాలో మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చారు. 
 
ఇప్పుడు మరోసారి తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పుకొచ్చాడు తమన్. "పిఎస్పీకే రానా" చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ 15 ఆగస్టు 2021న స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది.