సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (18:24 IST)

పవన్-రానా టైటిల్ @ ఆగష్టు15.. నిత్యామీనన్-ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చేసింది. వివరాల్లోకి వెళితే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ఓకే చేసారు. అందులో మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్ ఒకటి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.