మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:37 IST)

స్లిమ్, స్టైలిష్‌, స్మార్ట్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్న‌ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌

Mahesh Smart Look
సోమ‌వారం (ఆగ‌స్ట్‌9)న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన‌రోజు. బ‌ర్త్‌డేకు ఓ రోజు ముందుగా మ‌హేశ్ లేటెస్ట్ స్టిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్లిక్‌, స్టైలిష్‌, సూప‌ర్ స్మార్ట్ లుక్‌తో లేటెస్ట్ ఫొటోలో క‌నిపిస్త‌న్నారు మ‌హేశ్. ఫార్మ‌ల్ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా, మ‌రింత యంగ్‌గా కనిపిస్తున్నారు మ‌న సూప‌ర్‌స్టార్‌. 
 
గ‌త ప‌దిరోజుల నుంచి ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో డిఫ‌రెంట్ యాక్టివిటీస్‌తో మ‌హేశ్ బ‌ర్త్‌డే ను ట్రెండింగ్ చేస్తున్నారు. మ‌హేశ్‌బాబు టీమ్ ట్విట్ట‌ర్‌లో బిగ్గెస్ట్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేసుకుంది. మ‌హేశ్‌బాబుతో, ఆయ‌న సినిమాల‌తో అసోసియేష‌న్ ఉన్న సెల‌బ్రిటీలు ఆయ‌న సినిమాలు, సాధించిన విజ‌యాలు గురించి మాట్లాడుకుంటారు. 
 
త‌న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రం నుంచి రేపు(ఆగస్ట్ 9) ఉదయం 9 గంట‌ల 9 నిమిషాల‌కు, బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కు, సినీ అభిమానుల‌కు ట్రీట్ అందించ‌బోతున్నారు మ‌హేశ్‌. దీంతో పాటు మ‌రిన్ని స్పెష‌ల్ డే రోజున‌, స్పెష‌ల్ అనౌన్స్‌మెంట్స్ ఉండ‌బోతున్నాయి. రీసెంట్‌గా ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ రిపోర్ట్‌, జీఐఎఫ్‌ల‌కు అత్య‌ద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ చిత్రం నుంచి రాబోతున్న బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. 
 
ప‌రశురాం తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్ క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.