విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ ఎంతవరకు వచ్చింది!
విజయ్‌దేవరకొండ, రష్మిక జంటను `గీత గోవిందం` సినిమా నుంచి అభిమానులు రియల్ పెయిర్‌గా వుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశారు. ఆ సినిమాలో వారిద్దరి మధ్య నటన కెమిస్ట్రీ మామూలుగా లేదు. ఆ తర్వాత ఇద్దరూ `డియర్ కామ్రెడ్‌లోనూ మెప్పించారు. ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా పుంజుకుంటుందని టాక్ సినిమారంగంలో నెలకొంది. ఇది గత కొద్ది సంవత్సరాలుగా సాగుతుంది. మరోవైపు ఇద్దరూ తమ తమ చిత్రాల షూటింగ్‌లో బిజీగా వుంటున్నారు.
ఈ విషయంలో గతంలో ఓసారి విజయ్‌ను అడిగితే, తను మంచి ఫ్రెండ్ అని తెలియజేశాడు. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. ఆమె తరచూ తన సోషల్‌మీడియాలో ఎక్కువగా అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుంది. గతంలోకూడా తన అభిమానులతో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా వీరి ప్రేమ గురించి వచ్చిన సందర్భం కూడా వుంది. కానీ, తాజాగా మరోసారి తన అభిమానులతో ఇంట్రాక్ట్ అయింది. పలు రకాల ప్రశ్నలు అడిగుతున్న క్రమంలోనే ఓ అభిమాని. విజయ్‌తో మీకున్న రిలేషన్ ఏమిటని? అడిగాడు. అందుకు చాలా కూల్‌గా మేమిద్దం మంచి స్నేహితులం. నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ అంటూ క్లారిటీ ఇచ్చింది.