శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (22:57 IST)

సోనూ, రామ్ చరణ్ ఓవర్.. భీష్మ బ్యూటీ కోసం 900 కిలోమీటర్లు?!

భీష్మ బ్యూటీ రష్మిక మందన కోసం ఓ అభిమాని బయల్దేరాడు. ఇదేంటి బయల్దేరాడు అని అంటున్నారని అడిగితే.. అవును... సోనూ సూద్, రామ్ చరణ్‌లను పాదయాత్ర చేసి మరీ అభిమానులు కలిశారు. ప్రస్తుతం రష్మిక మందన కోసం ఆకాశ్ త్రిపాఠీ అనే ఓ వీరాభిమాని పాదయాత్ర చేపట్టాడు. 
 
ఆకాశ్ త్రిపాఠీ దేశమంతటా లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు సాగుతుండగానే తన అభిమాన సుందరిని కలుసుకుంటానని కర్ణాటక బయలుదేరాడట. 900 కిలోమీటర్లు రకరకాల పద్ధతుల్లో ప్రయాణించాడు. ట్రైన్‌లు, బస్సులు సరిగ్గా లేని కరోనా కాలంలో వీరాభిమాని ఎలా ముందుకు సాగాడో మనకు తెలియదుగానీ. ఆయన రష్మిక ఇంటి అడ్రస్ అడుగుతూ తిరుగుతోంటే కొందరికి అనుమానం వచ్చిందట. వెంటనే విషయం పోలీసులకి తెలిసింది. వాళ్లు ఆకాశ్ త్రిపాఠీని అరెస్ట్ చేశారు. మొత్తం కూపీ లాగారు. చివరకు తెలిసింది పాపం ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదనీ.  
 
వందల కిలో మీటర్లు ఆవేశంగా సాగిపోయిన అభిమాని ఆకాశ్ త్రిపాఠీ, దురదృష్టవశాత్తూ, రష్మికను కలుసుకోనే లేదు. ఆమె ముంబైలో హిందీ సినిమాల హడావిడిలో ఉండగా ఈయన కర్ణాటక వెళ్లాడు. చేసేదేం లేక పోలీసులు కూడా గట్టిగా బుద్ది చెప్పి ఇంటికి పంపేశారు. ఈ ఆకాశ్ త్రిపాఠీ ఎవరో కాదు.. తెలంగాణకు చెందిన వ్యక్తేనని పోలీసుల విచారణలో తేలింది.