గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 23 జూన్ 2021 (21:02 IST)

వర్షకు జూలై 4న పెళ్ళి, కాబోయేవాడు సుందరాంగుడట...

ఇమ్మానుయేల్, వర్ష కాంబినేషన్ పెద్దగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ ఇద్దరే. సీరియళ్ళలో నటిస్తూ వస్తున్న వర్ష జబర్దస్త్ షోకు వచ్చిన తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. అలాగే ఇమ్మానుయేల్ కూడా. ఈ షో ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెడితే వారిద్దరి ప్రేమాయణానికి కూడా షో కారణమైంది.
 
అయితే ప్రస్తుతం వర్ష పెళ్ళిచేసుకోబోతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. జూలై 4వ తేదీన నా పెళ్ళి. వరుడు సుందరాంగుడు. అన్ని సిద్థమయ్యాయి. ఇదిగో మా నిశ్చితార్థ ఉంగరమంటూ ఆమె చెప్పింది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అసలు ఎవరు ఆ సుందరాంగుడంటూ చర్చించుకున్నారు.
 
ఇది ఇలా జరుగుతుండగానే వర్ష, ఇమ్మానుయేల్‌కు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చిందట. జబర్దస్త్ షోలో భాగంగా జూలై 4వ తేదీన ఒక పెళ్ళి సీన్‌ను ఇమ్మానుయేల్, వర్ష మధ్య చిత్రీకరించారట. ఇందులో ఆమెను పెళ్ళి చేసుకుంటాడు ఇమ్మానుయేల్. 
 
అంతేకాదు నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తొడుగుతాడట. అభిమానులను సస్పెన్స్‌లో ఉంచడం కోసం వర్ష ఇలా చేసిందట. అయితే ముందుగానే జబర్దస్త్ సంస్థ వీడియోను రిలీజ్ చేయడంతో విషయం కాస్త బయటపడింది. దీంతో వర్ష చెప్పిందంతా అబద్ధమని అభిమానులు తిట్ల పురాణం అందుకున్నారట.