గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (06:34 IST)

ఈరోజు క‌నిపించని విధంగా ప్రీలుక్ - రేపు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

Mahesh pre look
‘సర్కారువారి పాట’ సినిమాను ప్రకటించినప్ప‌టి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌  ప్రతి ఒక్కరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసింది. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. ఈ ఫ‌స్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించ‌నున్నారు.
 
ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో మహేశ్‌బాబు చేతిలో బ్యాగ్‌ పట్టుకుని ఉన్నారు. అదే విధంగా  బైక్‌లు, కార్లులతో పాటు కొందమంది రౌడీల‌ను మ‌నం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ పోస్టర్‌ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను సంబంధించినది అని తెలుస్తుంది.
 
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు త‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.
ప్రముఖ నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా కనిపిస్తారు.
 
లెటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ తమన్ ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ‘సర్కారువారి పాట’ చిత్రానికి అంతకుమించిన రేంజ్‌లో మ్యూజిక్‌ ఆల్భమ్‌ ను రెడీ చేస్తున్నారు తమన్‌. ఆర్‌. మధి కెమెరామ్యాన్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఎఎస్‌ ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
నటీనటులు: మహేశ్‌బాబు, కీర్తీ సురేష్, ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు తదితరలు...
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: పరశురామ్‌ పేట్ల, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేనీ, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, బ్యానర్స్‌: మైత్రీమూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌,  మ్యూజిక్‌ డైరెక్టర్‌: తమన్‌ ఎస్‌ ఎస్‌,  సినిమాటోగ్రఫీ: ఆర్‌. మధి ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎఎస్‌ ప్రకాశ్‌,  ఫైట్స్‌: రామ్‌ –లక్ష్మణ్‌,  లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ కుమార్‌.