సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:18 IST)

అత్యాచారాలను అడ్డుకున్నపుడే నిజమైన రక్షా బంధన్ : పవన్ కళ్యాణ్

రక్షా బంధన్‌ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధను కలిగిస్తున్నాయని, వాటిని అడ్డుకున్నపుడే నిజమైన రక్షా బంధన్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మనసును కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెల్లే అనే భావన అందరిలో రావాలని చెప్పారు. మహిళలు, అమ్మాయిలు నిర్భయంగా తిరిగేలా వారికి భరోసా ఇవ్వాలని అన్నారు. 
 
అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్ అని చెప్పారు. భారతీయుల బాంధవ్యాలను తెలిపే వేడుకే రక్షా బంధన్ అని పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విషయాల్లో సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగుతుండటం బాధను కలిగిస్తోందని అన్నారు.
 
అలాగే, వైఎస్ఆర్ టీపీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా రాక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తన తోడబుట్టిన జగనన్నకు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనకు అండగా నిలిచిన, తాను ఎంచుకున్న మార్గంలో తనతో కలిసి నడుస్తున్న, తన ఆశయ సాధనలో తనను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని షర్మిల చెప్పారు.