1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:57 IST)

షర్మిలకు షాకిచ్చిన ఇందిరా శోభన్ : పార్టీకి గుడ్‌బై

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించి పట్టుమని పది నెలలు కూడా పూర్తికాకముందే ఆ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నాయకురాలు ఇందిరా శోభన్ వైఎస్ఆర్టీపీకి రాజీనామా చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో ఆమె ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఇంకా బలపడన వైఎస్ఆర్టీపీకి చెందిని పలువురు నాయకులు ఇప్పటికే పార్టీకి దూరమవుతున్నారు. ఇపుడు ఇందిరా శోభన్ కూడా గుడ్ బై చెప్పారు. 
 
ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ వివరించినట్టు సమాచారం. 
 
అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను అని ఇందిరా శోభన్ రాసిన లేఖలో పేర్కొన్నారు.