శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (21:22 IST)

ఆధార్ ఆఫీసులో ఉద్యోగాలు.. 6 ప్రాంతాల్లో ఉన్న రీజనల్‌ ఆఫీసుల్లో..?

యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌తో పాటు పలు రీజనల్‌ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం. యూఐడీఏఐ ప్రధాన లక్ష్యం భారత పౌరులకు ఆధార్‌ కార్డులు జారీ చేయడం.

దేశంలోని 6 ప్రాంతాల్లో ఉన్న రీజనల్‌ ఆఫీసుల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో యూఐడీఏఐ రీజనల్‌ ఆఫీసులు ఉన్నాయి.
 
ఈ ఆఫీసుల్లో ఉన్న ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్‌ ఆఫీసర్, ప్రైవేట్‌ సెక్రెటరీ లాంటి పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్‌ ఆఫీసులో 2 ప్రైవేట్‌ సెక్రెటరీ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన మరిన్ని వివరాలను యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ www.uidai.gov.in లో తెలుసుకోవచ్చు.
 
దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్‌ డౌన్‌ లోడ్‌ చేయాలి. వేర్వేరు రీజనల్‌ ఆఫీసులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రీజనల్‌ ఆఫీసులోని పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆ ఆఫీసుకి మాత్రమే దరఖాస్తులు పంపాలి.