సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (18:24 IST)

చిరంజీవి బర్త్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు- మ‌రోవైపు సినిమాల అప్‌డేట్స్‌

Sohel-Appireddy
పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహిహెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు శనివారం హైదరాబాద్ నగరంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. అప్పిరెడ్డి ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డితోపాటు, సోహి హెల్పింగ్ హ్యాండ్స్, మైక్ మూవీస్, మైక్ టీవీ సంస్థల ప్రతినిధులు చక్రధర్ రావు, రవి రెడ్డి, చరిత్, సంపత్, జగ్గూ  పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడివారికి అన్నదానంతోపాటు పళ్లు ఫలహారాలు అందించారు. చిరంజీవి చిరకాలం ఆయురోరాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.  సామాజిక సేవలో చిరంజీవి తమకు ఆదర్శమని కొనియాడారు.  చీర్ ఫౌండేషన్ (కైతలాపూర్), శ్రీ ఆదర్శ్ ఫౌండేషన్(మోతీ నగర్), జీవోదయ ఆర్ఫనేజ్(మోతీ నగర్), మదర్స్ నెస్ట్ ఓల్డేజ్ హోమ్ (నేరేడ్ మెట్), ఆర్క్ ఆఫ్ ఏజెంలికా ఆర్ఫనేజ్ (కాప్రా), అభిసాయి దత్త ట్రస్ట్ (ఉప్పల్)లో ఈ సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
 
ఇదిలా వుండ‌గా, రేపు ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో సందడి మొదలైంది. చాలామంది చిరు ఫొటోతో తమ డీపీలను కూడా మార్చేస్తున్నారు. ఇక చిరు చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు సైతం క్యూ కడుతున్నాయి.
 
God father
గాడ్ ఫాద‌ర్ లుక్ విడుద‌ల చేశారు
- ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన‌. టైటిల్‌/ఫస్ట్‌లుక్ గాడ్ ఫాద‌ర్‌గా విడుద‌ల చేశారు.
 
Cake cutting
బ్ల‌డ్ బేంక్‌లో వేడుక‌లు 
- అలాగే బ్లండ్ బేంక్‌లో మెహ‌ర్ ర‌మేష్‌, నాగ‌బాబు ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేసి అభిమానులు సంద‌డి చేశారు. కాగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆదివారం ఉదయం 9గంటలకు ‘మెగా యుఫోరియా’ పేరుతో అప్‌డేట్‌ ఇవ్వన్నట్లు తెలిపింది. ఇక‌, కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకోనుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి అప్‌డేట్స్ రాబోతున్నాయి.