1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 జులై 2021 (17:45 IST)

లూసిఫర్ రీమేక్ లో ఎన్నో సస్పెన్స్‌లున్నాయి

chiru
చిరంజీవి న‌టించ‌నున్న `లూసిఫర్` రీమేక్ లో సస్పెన్స్‌లున్నాయి. అవన్నీ తరువాత చెబుతాను` అని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎన్వీ ప్రసాద్ తెలియ‌జేస్తున్నారు. బుధ‌వారం ఆయ‌న టూసిఫ‌ర్ రీమేక్ సినిమా గురించి కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. ఆగస్ట్ 13వ తారీఖు చిరంజీవి సినిమా మొదలవుతుంది. ఎడిటర్ మోహన్‌ది సినిమా ప్రపంచం తప్పా మిగతావేవీ తెలియని ఫ్యామిలీ. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటారు మా దర్శకుడు మోహన్ రాజా. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతోనే ఉంటారు అని తెలిపారు.
 
తాజాగా లూసిఫ‌ర్ రీమేక్ సినిమా గురించి న‌టీన‌టుల ఆడిష‌న్లు జ‌రుగుతున్నాయి. మెయిన్ కేరెక్ట‌ర్లు కొన్ని ఫిక్స్ అయితే సినిమాలోని ఇత‌ర న‌టీన‌టుల గురించి జూబ్లీహిల్స్‌లోని  సూప‌ర్‌గుడ్ కార్యాయ‌లంలో పెద్ద సంఖ్య‌లో న‌టీన‌టులు ఆడిష‌న్‌లో పాల్గొన్నారు. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22. కానీ 9 రోజుల ముందుగానే లాంఛ‌నంగా సినిమా ప్రారంభం కావ‌డం కూడా ఓ స‌స్పెన్స్ అని తెలుస్తోంది.