గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:22 IST)

ఉత్తమ ఉపాధ్యాయులుగా 24 మంది ఆచార్యుల ఎంపిక

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని మొత్తం 24 మంది ఆచార్యులకు పురస్కారం లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 24 మంది ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 
 
ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారంటే..? జయశంకర్ వర్శిటీ నుంచి ఆరుగురు, ఓయూ నుంచి ఐదుగురు ఎంపికయ్యారు.
 
ఆయా వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 24 మంది అధ్యాపకులను కూడా ప్రభుత్వం పురస్కారాలకు ఎంపిక చేసింది. పాలిటెక్నిక్ కళాశాల్లో పనిచేసే మరో నలుగురు అధ్యాపకులు సైతం పురస్కారాలు అందుకున్నారు.