1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. a young man escaped with sister-inlaw

ఆ గేమ్‌తో దగ్గరై మరిదితో కలిసిన వదిన పరార్

young man
వదిన అంటే తల్లితో సమానం. అన్న భార్యను అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మరిది మాత్రం అలా అనుకోలేదు. వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకుని నగలు, నగదుతో ఇంటి నుంచి పరారయ్యాడు.
 
జోద్‌పూర్ ప్రాంతానికి చెందిన రాణి, అశుతోష్‌లకు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇంకా పిల్లలు లేరు. భర్త ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా లూడో గేమ్ ఆడుతూ ఉండేది రాణి.
 
లూడో గేమ్ ఆడటం కొన్నిసార్లు తెలియక మరిది సంజయ్ సహాయం తీసుకునేది. మొదట్లో వీరి మధ్య మరిది వదిన సంబంధమున్నప్పటికీ ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు.
 
ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా రాణి, సంజయ్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అయితే మూడు రోజుల క్రితం ఇంటిలోని నగలు నగదును ఎత్తుకుని పారిపోయారు జంట.
 
సీసీ కెమెరాల్లో వీరిద్దరూ కలిసి వెళుతున్న విజువల్స్‌ను చూసిన భర్త షాక్ అయ్యాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ జంట ఉంది.
తర్వాతి కథనం
సజ్జనార్ ఇక్కడ కూడా మొదలెట్టేశారు: పక్కపక్కనే ఉన్న డిపోల ఏకీకరణ, కొన్నిచోట్ల మూసివేత