శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (18:34 IST)

కండోమ్ లేదని కక్కుర్తి పని చేసాడు

తన ప్రియురాలితో ఓ యువకుడు అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాత పడ్డాడు. ఆమెకి గర్భం రాకుండా వుండేందుకు కండోమ్ ధరించి పాల్గొనాలని అనుకున్నాడు, కానీ దాన్ని మర్చిపోవడంతో హోటల్ గదిలో వున్న ఓ జిగురులాంటి పదార్థాన్ని పూసుకుని పాల్గొన్నాడు. ఫలితంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అహ్మదాబాదుకి చెందిన 25 ఏళ్ల సల్మాన్ తన ప్రేయసితో కలిసి హోటలుకి వెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసేటపుడు కండోమ్ మర్చిపోయిన సంగతి తెలుసుకున్నాడు.  వెంటనే హోటల్ గదిలో వున్న ఓ జిగురు లాంటి పదార్థాన్ని పూసుకుని పాల్గొన్నాడు.
 
ఆ జిగురు ప్రభావంతో అతడి వ్యక్తిగత భాగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ క్రమంలో అతడు తన ఇంటికి సమీపంలో పొదల్లో పడిపోయి కనిపించాడు. అతడిని పరిశీంచిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆ జిగురు పదార్థం రసాయనాలతో కూడి వుండటం వల్ల అతడి అవయవాలు దెబ్బతిని మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. కాగా అతడి ప్రియురాలి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.