శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 28 ఆగస్టు 2021 (19:57 IST)

కరోనా చచ్చిపోయిందా- పారిపోయిందా? రోజా గారు మాస్కులు వేసుకోలేదే? స్కూలు పిల్లలు కూడా?

సొంత నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే రోజా. నిరంతరం ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుంటారు. అంతేకాకుండా సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మరింత బిజీగా ఉంటున్నారు. నేటి పర్యటనలో భాగంగా రోజా నిండ్ర మండలం అత్తూరులో పాఠశాలలో పర్యటించారు.
 
రోజాతో పాటు ఆమెతో పాటు వచ్చిన వారు.. కనీసం పాఠశాలలో ఎవరూ కూడా మాస్కులు ధరించలేదు. ఉపాధ్యాయినిగా రోజా పాఠశాలలో పాఠాలు చెప్పారు. తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భూమి - మనం అనే  పాఠ్యాంశంను తీసుకుని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
అంతేకాదు విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. రోజా పాఠాలు చెబుతుండటంతో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అయితే కరోనా గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పే రోజానే మాస్కును ధరించకపోవడం.. ఆమెతో పాటు వచ్చిన వారు మాస్కులు వేసుకోకపోవడం విమర్సలకు తావిస్తోంది.