శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (11:24 IST)

పెళ్లి చేసుకున్నప్పటికీ అత్యాచారం కేసు పోదు : ఢిల్లీ హైకోర్టు

rape
అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నప్పటికీ నిందితుడిపై ఉన్న అత్యాచార కేసు తొలగిపోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, "గత 2019 నవంబరులో ఓ మైనర్ బాలికపై 27 యేళ్ల నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్ళ తర్వాత 2021లో నిందితుడి ఇంటివద్ద ఆ బాధిత బాలిక కనిపించింది. అప్పటికే ఆ బాలిక 8 నెలల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బాలికపై కామాంధుడు మరోమారు అత్యాచారానికి పాల్పడటంతో మళ్లీ గర్భందాల్చింది. 
 
దీంతో కామాంధుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించన ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసుల్లో బాధిత బాలిక అంగీకరించిందా? లేదా? అన్నదానితో సంబంధం లేదని పేర్కంది. ఒకవేళ బాలిక తెలివి తక్కువతనంతో అంగీకరించినా చట్టప్రకారం దానికి గుర్తింపులేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 
 
అదేసమయంలో బాధితురాలని తాను పెళ్లి చేసుకున్నాను కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోర్టును ప్రాధేపయపడ్డాడు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ, బాధిత బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన అతడు పవిత్రుడైనట్టు కాదని, అత్యాచారం కేసు తొలగిపోదని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఈ కేసు నుంచి నిందితుడు తప్పించుకోజాలడని పేర్కొంది.