మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ లంభించేనా?
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నేడు విచారణ జరుపనుంది. ఆయనకు గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడగించింది.
ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనుంది. కాగా, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్యచేసినట్టుగా అనంతబాబు అంగీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడులు కారణంగా ఆ పని చేయలేదు.
పైగా, రాజమండ్రి జైలులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమర్యాదలు చేస్తున్నట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనంతబాబును కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.