గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (22:14 IST)

శరద్‌ పవార్‌పై వ్యాఖ్యలు : మరాఠీ నటి కేతకి చితాలేకు బెయిల్

Ketaki Chitale
నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ను అవమానకర రీతిలో ప్రస్తావించిందన్న ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్‌ మంజూరైంది.
 
సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో శరద్‌పై అభ్యంతకర పోస్టులు చేసిందన్న కారణంగా కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. 
 
రూ. 20 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్‌ ఇచ్చారు  మహారాష్ట్ర థానే జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్‌.ఇప్పుడు కేతకి థానే సెంట్రల్‌ జైల నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.