మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (17:23 IST)

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

shyamaladevi
శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలదేవి అన్నారు. సోమవారం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ పెళ్లి‌పై మరొసారి వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ పెళ్లి గురించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసినట్టు చెప్పారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అందువల్ల శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుందని ఆమె అన్నారు. ప్రభాస్ పెళ్లి చేయాలని మాకూ ఉందన్నారు. కానీ, ఏదైనా శివుడి ఆజ్ఞ మేరకే ఏదైనా జరుగుతుందని ఆమె చెప్పారు.