గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (12:50 IST)

గోల్‌మాల్ సాంగ్‌కు స్టెప్పులేసిన లయ.. వీడియో వైరల్

Laya
Laya
సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన లయ, ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో దాదాపుగా టాప్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ.. 2006లో గణేష్ గోరటి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.
 
కాగా, సోషల్ మీడియాలో మాత్రం లయ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. యూఎస్‌లో ఉంటున్న ఈ బ్యూటీ ఎప్పటికపుడు ట్రెండీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది. 
 
ఇప్పటికే లయ యూఎస్ వీధుల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సాంగ్‌తో నెటిజన్ల ముందుకొచ్చింది లయ. ఈ సారి తాను నటించిన హనుమాన్ జంక్షన్‌లోని పాటకు స్టెప్పులేసింది. 
 
హిట్ ట్రాక్‌ గోల్‌మాల్ సాంగ్‌కు తన పార్ట్‌నర్ సారికా రెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసి నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఈ డ్యాన్స్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది లయ. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.