శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (17:54 IST)

జుమ్కా బరేలి వాలా పాటకు స్టూడెంట్స్‌తో స్టెప్పులేసిన టీచర్ (video)

Teacher Dance
Teacher Dance
పాప్యులర్ సాంగ్ "జుమ్కా బరేలి వాలా" పాటకు ఓ టీచర్, తన విద్యార్థినులతో కలసి తరగతి గదిలోనే అందంగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. విద్యార్థులు కొద్దిగా తడబడినా.. టీచర్ మాత్రం స్టెప్పుల్లో లయ తప్పలేదు. దీన్ని ఇప్పటికే 5.69 లక్షల మంది చూసేశారు. 
 
టీచర్ మను గులాటి స్వయంగా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. "వేసవి శిబిరం చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది" అంటూ టీచర్ తన పేజీలో రాశారు.  
 
ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటీ స్నేహంగా మెలగడం ద్వారా విద్యార్థుల మనసులను చూరగొనడమే కాదు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న వ్యక్తి. ఇందులో 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న నేషనల్ టీచర్స్ అవార్డు కూడా ఉంది.