శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (22:57 IST)

"నాటు నాటు" పాటకు డ్యాన్స్ చేసి ఫిదా చేసిన వధువు (video)

natu natu -bride
టాలీవుడ్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". రాజమౌళి దర్శకుడు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రేక్షకులతో పాటు.. ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ పాటలోని స్టెప్పుల కోసం ఈ ఇద్దరు హీరోలు ఎంతగా శ్రమించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఇప్పుడు, వార్త ఏమిటంటే, కొత్త జంట వధువు తన స్నేహితురాళ్లతో కలిసి వేదికపై నాటు నాటు పాటతో నృత్యం చేసింది. అదీకూడా "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని చెర్రీ, తారక్‌లు చేసిన డ్యాన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా, ఫుల్‌ ఎనర్జీతో డ్యాన్స్ చేసి వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.