శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (14:18 IST)

కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టబోయిన వ్యక్తి.. అదేం చేసిందంటే? (video)

King cobra
King cobra
పాము అంటేనే ఆమడదూరం పారిపోతారు. చాలామంది. కానీ ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం దానికి ముద్దు పెట్టాలనుకున్నాడు.  పాము పడగ తీసి ఉండగానే.. వెనకి నుంచి వచ్చి దానికి ముద్దు పెట్టబోయాడు. ఈ క్రమంలో అది అతడికి షాకిచ్చింది. ఒక్కసారిగా నోరు తెరిచి.. అతడిని కరిచేందుకు ప్రయత్నించింది. 
 
అంతే ఒక్కసారిగా జడుసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి అదే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఈ సారి మాత్రం విజయవంతంగా కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది.