శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (09:24 IST)

ఢిల్లీ మెట్రో స్టేషన్ అక్షరధామ్ నుంచి దూకిన యువతి..

woman suicide
ఢిల్లీలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్షరధామ్ మెట్రో స్టేషన్ భవనం పైనుంచి కిందికి దూకింది. ఆ వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ యువతిని ప్రాణాలతో రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఆత్మహత్య చేసుకునేందుకు అక్షరధామ్ మెట్రో స్టేషన్ భవనంపైకి ఎక్కిన ఓ యువతిని చూసిన ఇతర ప్రయాణికులు వెంటనే సీఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కిందికి దిగి రావాలంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలను ఆ యువతి పెడచెవిన పెట్టారు. 
 
మరోవైపు, కొందరు ప్రయాణికులు, సిబ్బంది కలిసి ఓ దుప్పటిని గట్టుగా పట్టుకుని అందులో పడేలా ఏర్పాట్లుచేశారు. అయితే, ఆ యువతి పడిన వేగానికి నేలకు బలంగా తాకడంతో ఆ యువతికి స్పల్పంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. 22 యేళ్ళ వయస్సున్న ఆమెన పంజాబ్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.