సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (14:43 IST)

ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు.. భారీ మోసం బట్టబయలు

fake
విజయవాడలో ఓ కన్సల్టెన్సీ చేస్తున్న భారీ మోసం బట్టబయలు అయ్యింది. ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపుతామంటూ మోసం చేస్తున్నారు. ఈ చీటింగ్ కన్సల్టెన్సీ భారీ మోసాన్ని ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్ గుర్తించింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి విదేశాలకు పంపిస్తున్నారు. 
 
మంగళవారం ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్.. విజయవాడ వచ్చి స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ స్కామ్‌లో ముళ్లపూడి కేశవ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.