హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్.. త్వరలో ఆరు లేన్లు!
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే(ఎన్‌హెచ్65)ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రోడ్డు త్వరలో ఆరు లేన్లుగా మారనుంది.
ఆరు లేన్ల నిర్మాణంలో అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు కీలకంగా మారనున్నాయి. మొదటి దశ నాలుగులేన్ల రోడ్డు చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పదేళ్లు పూర్తవుతుంది. బీఓటీ పద్ధతిలో జీఎమ్మార్ సంస్థ 2009లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ప్రారంభించి 2012లో పూర్తి చేసింది.
చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురం నుంచి విజయవాడు వరకు 238 కిలోమీటర్లు కాగా, దీంట్లో తెలంగాణ పరిధిలో నేషనల్ హైవే 182 కిలోమీటర్లు మాత్రమే.
దండుమల్కాపురం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు ఆరులేన్లుగా విస్తరించేందుకు సుమారు రూ.3వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.